News February 11, 2025
రేపే మేడారం జాతర..!

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్లో తెలపండి.
Similar News
News December 6, 2025
నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.
News December 6, 2025
శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.
News December 6, 2025
KMR: రెండో విడత.. ఆ 7 మండలాల్లో మద్యం బంద్: కలెక్టర్

KMR జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ DEC 14న జరగనుంది. ఈ విడతలో గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం సహా 7 మండలాల్లో (ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా) వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 14వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు.


