News April 11, 2025
రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 17, 2026
పరిశ్రమలకు అనుమతులు వెంటనే ఇవ్వాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్సిడీలు ఇచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
News April 17, 2026
జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

జర్నలిస్టులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఇటీవల మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ, రవికుమార్ కుటుంబాలకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.