News April 11, 2025

రేపే రిజల్ట్.. అనకాపల్లి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఫస్టియర్ 12,936 మంది, సెకండియర్ 13,225 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 26 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 8, 2025

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

image

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.

News December 8, 2025

HYD: ప్రభుత్వ ఆఫీసర్లకు గ్లోబల్ సమ్మిట్ డ్యూటీ

image

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు డ్యూటీ విధించారు. మీర్‌ఖాన్‌పేట్‌లో నేడు, రేపు సమ్మిట్ వైభవంగా జరగనుంది. భారీ సంఖ్యలో పోలీసులను సమ్మిట్ ప్రాంతానికి తరలిస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాట్ల పనుల కోసం నియమించడంతో వారు మొత్తం కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమయ్యారు.

News December 8, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.