News April 11, 2025
రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫస్టియర్ 13,083, సెకండియర్ 10,904 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 20, 2025
జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఎంతంటే?

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.190-210 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ.220-240 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. జిల్లాలో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ.. త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
News April 20, 2025
సదుం: అధికారుల తీరుతో విసిగి ACBకి ఫిర్యాదు

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు షఫీ ఉల్లా తెలిపారు. తనకు సంబంధించిన 5.60 ఎకరాల సెటిల్మెంట్ భూమిని అధికారులు అసైన్మెంట్గా మార్పు చేశారని.. తిరిగి దానిని సెటిల్మెంట్గా నమోదు చేసేందుకు రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని ఆయన వాపోయారు. దానిని చెల్లించేందుకు ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి తాహశీల్దార్, వీఆర్ఓలను పట్టించినట్లు చెప్పారు.