News April 22, 2025
రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓ హక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో బుధవారం జరగబోయే ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ముమ్మురమైన ఏర్పాటు చేస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News April 22, 2025
బీఆర్ఎస్ సభకు ప్రత్యేక ఏర్పాట్లు: జైపాల్ యాదవ్

వరంగల్లో బీఆర్ఎస్ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు 35 బస్సులు, 300 బైకులు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. మంగళవారం కడ్తాల్ లో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. సభకు తరలి వెళ్లే ముందు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
News April 22, 2025
HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్ 67.74 స్టేట్ 23వ ర్యాంక్