News February 4, 2025

రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌పై పోక్సో కేసు

image

రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ భూక్య వెంకటేశ్వర్లుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్ఐ ఎన్.రాజారామ్ తెలిపారు. డిప్యూటీ వార్డెన్‌ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధించాడని ఓ విద్యార్ధి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Similar News

News February 15, 2025

ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.

News February 14, 2025

నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

image

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.

News February 14, 2025

ఆర్థిక అభ్యున్నతితోనే మహిళా సాధికారత: ఖమ్మం కలెక్టర్

image

ఆర్థిక అభ్యున్నతితోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గ్రామీణ మహిళా వ్యాపారులు, సెర్ప్ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారాల నైపుణ్యాభివృద్ధిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల కుటుంబాలు బాగుపడతాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!