News July 11, 2024
రేవంత్‌తో సమానంగా భట్టి ఫొటోను పెట్టాలి: మోత్కుపల్లి

ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటోను అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేయడం హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 18, 2025
నల్గొండ: వేసవికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచి నీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
News February 18, 2025
నేడు పెద్దగట్టు జాతరలో చంద్రపట్నం

పెద్దగట్టు జాతరలో నేడు మూడోరోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.