News March 7, 2025
రేవంత్ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే: KTR

కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే అని ఆరోపించారు.
Similar News
News November 26, 2025
రాజోలు: పల్లె పండుగ 2.0లో ఉపముఖ్యమంత్రి పవన్ క

రాజోలు మండలం శివకోడులో కలెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 2.0’ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పల్లె పండుగ 1.0’ అభివృద్ధి పనుల ఫోటో గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
News November 26, 2025
ములుగు: సర్పంచ్ నేనే.. నాకు కన్ఫర్మ్ అయ్యింది!

ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగా, పోటీలో ఉన్న అభ్యర్థులు టికెట్ వస్తుంది.. నన్ను కన్ఫామ్ చేశారంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారే నేనే సర్పంచ్ అంటే.. నేనే సర్పంచ్ అంటూ గ్రామాల్లో గప్పాలు కొడుతుండటంతో ఓటర్లు తికమక పడుతున్నారు.
News November 26, 2025
ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.


