News March 7, 2025

రేవంత్‌ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే: KTR

image

కరీంనగర్‌ – నిజామాబాద్‌ – మెదక్‌ – ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భస్మమే అని ఆరోపించారు.

Similar News

News January 19, 2026

కర్నూలు కలెక్టరేట్‌లో 270 ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

image

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు మొత్తం 270 అర్జీలు అందినట్లు డీఆర్వో వెంకట నారాయణమ్మ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 167 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ అర్జీలను ఆయా శాఖల వారీగా వర్గీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

News January 19, 2026

గద్వాల: రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవాన్ని జిల్లాలో అట్టహాసంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అడిషనల్ ఎస్పీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదికపై KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి దాఖలు చేసిన పిటిషన్లను HC విచారించింది. కేసీఆర్‌, హరీశ్ తరఫున అడ్వకేట్‌ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై ఫైల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం రిప్లై ఇవ్వడానికి టైమ్ కావాలని AG కోరారు. FEB 20లోపు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు కోర్టు వాయిదా వేసింది.