News July 29, 2024
రేవంత్ పీసీసీ అయినా.. సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే: హరీష్ రావు

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయని అన్నారు.
Similar News
News October 13, 2025
మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.
News October 12, 2025
మెదక్: సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్‌లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.
News October 12, 2025
మెదక్: మీ వ్యక్తిగత డేటాకు గ్యారంటీ లేదు.. జర జాగ్రత్త..!

ఇంట్లో వాడి వదిలేసిన ఫోన్లను మొబైల్ షాపులకు లేదా తెలియని వ్యక్తులకు అమ్మడం ప్రమాదకరమని MDK అధికారులు సూచిస్తున్నారు. నేరగాళ్లు ఆ ఫోన్లలోని IMEI నంబర్లు, మదర్ బోర్డులు, సాఫ్ట్‌వేర్ సేకరించి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారని, ఈ పరికరాల ద్వారా బ్యాంక్ మోసాలు, డేటా చోరీలు, ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పాత మొబైల్ అమ్మే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నారు.