News October 8, 2024

రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలి: హరీశ్ రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, BRS నేత హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజలు ఆవేదనకు గురిచేస్తోందని మండిపడ్డారు. అవకాశాలు వస్తే పేదలకు మంచి చేయాలని అంతే గానీ వారికి కన్నీరు పెట్టించడం సరికాదన్నారు. మల్కాజిగిరి పరిధిలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ చెప్పారు.

Similar News

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.