News December 28, 2024
రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై రూ.400 బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అన్నారు.
Similar News
News October 17, 2025
మెదక్: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు: ఎస్పీ

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ఫ్లాగ్ డే పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ అండ్ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలో ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News October 17, 2025
మెదక్: దీపావళి ఆఫర్ల పేరుతో మోసం: ఎస్పీ

దీపావళి పండుగ స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ల ద్వారా లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ.. ఈ లింకుల ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫేక్ లింకులు, వెబ్ సైట్లలో వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఇవ్వరాదని సూచించారు.
News October 17, 2025
మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.