News November 8, 2024

రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !

image

8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు.  2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.

Similar News

News December 10, 2024

ఉమ్మడి MBNR జిల్లా ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి.అత్యధికంగా గద్వాల జిల్లా సాటేర్లలో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా మాగనూరులో 32.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 29.3 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో 28.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 10, 2024

గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం

image

గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాల్‌కు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై ఆదివారం రాత్రి గుండుమాల్-పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్‌‌కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు. దానిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేస్తామన్నారు.

News December 10, 2024

MBNR: రాష్ట్రంలోనే అవినీతిలో మనమే టాప్!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా 15 మంది పట్టుబడగా.. 22 మందిని కోర్టులో హాజరు పరిచారు. రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి కేసులు ఉమ్మడి పాలమూరులోనే నమోదయ్యాయి. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే, లంచాన్ని ఉపేక్షించకండి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుదాం. లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం