News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. కరీంనగర్ REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా, ఈ ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు రూ.1,000 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం, ఉమ్మడి జిల్లా రోడ్ల విస్తరణకు రూ.100 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లు ఇంకా మరెన్నో నిధులు తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.