News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి మెదక్ REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?
Similar News
News February 5, 2025
శివంపేట హత్య కేసు UPDATE
శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్లాల్ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్లాల్ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ
వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News February 5, 2025
మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు
మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.