News April 27, 2024

రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు: డీకే అరుణ

image

షాద్ నగర్ పరిధిలోని ఎలకిచర్ల, జిల్లేడు చౌదరిగూడలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శనివారం రోడ్ షో నిర్వహించారు. అరుణ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు.. అయన సీఎం స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రజాధరణ కోల్పోయిందన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

Similar News

News November 8, 2024

రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !

image

8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు.  2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.

News November 8, 2024

10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.

News November 8, 2024

MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO

image

మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.