News December 29, 2024

రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థులకు శాపంగా: హరీష్ రావు

image

విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.

Similar News

News January 20, 2025

MDK: రద్దీగా మారిన బస్టాండ్లు

image

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు గత 3 రోజులుగా ప్రయాణికులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో HYDలో చదువుతున్న విద్యార్థులు, పని నిమిత్తం ప్రజలు భారీగా తరలివెళ్లడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

News January 20, 2025

మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.

News January 19, 2025

డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు

image

సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.