News December 5, 2024
రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదని ఎమ్మెల్యే హరీష్ రావు X వేదికగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు.
Similar News
News July 6, 2025
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఖాజాపూర్ వాసి ఎంపిక

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కి చెందిన విష్ణు శ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. జులై 12, 14వ తేదీల్లో దెహ్రదూన్‌లో జరిగే జాతీయ రగ్బీ పోటీలలో చరణ్ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.
News July 5, 2025
మెదక్: IIITకి 345 మంది ఎంపిక

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.
News July 5, 2025
జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.