News October 20, 2024

రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర: ఆర్ కృష్ణయ్య

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలు చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రూపు- 1 పరీక్షలలో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, జీవో 29ని వెంటనే ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

Similar News

News November 3, 2025

మీర్జాగూడ ఘటన.. స్వాతి మృతి

image

చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తాండూరు పట్టణం వాల్మీకి నగర్‌కి చెందిన వెంకటమ్మ అలియాస్ స్వాతి(22) అనే వివాహిత మృతిచెందింది. బూరుగుపల్లికి చెందిన లక్ష్మమ్మ-ఏసప్పల కూతురైన స్వాతి వాల్మీకి నగర్‌కు చెందిన ప్రసాద్‌కు రెండున్నరేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. స్వాతి హైదరాబాద్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుండగా, ప్రసాద్ క్యాంటీన్‌లో పనిచేస్తుంటాడు. స్వాతి ఊరు నుంచి వస్తూ ప్రమాదంలో మరణించింది.

News November 3, 2025

సికింద్రాబాద్: ఉజ్జయిని మహకాంళిని దర్శించుకున్న కలెక్టర్

image

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని డీసీపీ రష్మిక పెరుమాళ్, జిల్లా కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటన

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ కోదండరాం తెలిపారు. షేక్‌పేట్‌ పరిధి ఓయూ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు వివేక్, అజహరుద్దీన్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ జన సమితి మద్దతు కోరారని, ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.