News April 25, 2024
రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్..!

సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోస్ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా మద్దూరులో, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లూరు రవికి మద్దతుగా బిజినపల్లిలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో విజయంపై ధీమాతో ఉన్నారు.
Similar News
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
బాలానగర్లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి


