News February 9, 2025

రేవుపోలవరం: జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

image

రేవుపోలవరంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే మాఘ పౌర్ణమి జాతర ఏర్పాట్లను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. జాతర జరిగే రేవుపోలవరం సముద్ర తీరాన్ని శనివారం సందర్శించారు. సముద్ర స్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ఉన్నారు.

Similar News

News December 9, 2025

WGL: ఉద్యోగులారా.. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి..!

image

ఎన్నికల విధులకు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 11, 14, 17న ఎన్నికలు జరుగుతుండగా ఉద్యోగులు తమ ఓటు హక్కు ఉన్న మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయవచ్చు. ఇందుకోసం వారు ఎన్నికల డ్యూటీ ఆర్డర్ కాపీ, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటరు కార్డును ఆ సెంటర్లో ఇచ్చే ఫారం-14, 15జత చేసి ఓటేయొచ్చు.

News December 9, 2025

వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ప్రజలు వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మొదటి విడత ఎన్నికల్లో 160 గ్రామ పంచాయతీల్లో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 జీపీలకు 411 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 1402 వార్డుల్లో 332 ఏకగ్రీవం కాగా, పాపన్నపేటలోని అరికెలలో రెండు వార్డులకు నామినేషన్లు రాలేదన్నారు.

News December 9, 2025

సంగారెడ్డి: మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలోని 7 మండలాల్లో జరిగే మెదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు బందోబస్తు మధ్య డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తరలించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు.