News January 16, 2025

రేవుపోలవరం సముద్రంలో మునిగి బాలుడి మృతి

image

రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం కనుమ పండుగ రోజున బాలుడు సముద్రంలో మునిగి మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పలువురు రేపు పోలవరం సముద్ర తీరానికి వచ్చారు. వీరిలో సాత్విక్ (10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ (22) గల్లంతయ్యాడు. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సాత్విక్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News February 26, 2026

విశాఖ: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి’

image

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు విస్తృత స్థాయిలో స‌మాచారం చేరవేయాల‌నే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్‌ను సంబంధిత అధికారుల‌తో క‌లిసి గురువారం విశాకలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు పారదర్శకత, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

News February 26, 2026

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

image

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.