News January 25, 2025

రేవు పోలవరం హైస్కూల్‌ని విజిట్ చేసిన DEO

image

అనకాపల్లి DEO అప్పారావు ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం హైస్కూల్‌ని శుక్రవారం విజిట్ చేశారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన కౌశిల్ ప్రతిభా పరీక్షల్లో రాణించిన పాఠశాల విద్యార్థులు ఐశ్వర్య, నాగరాజు, దయానంద్‌కు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో మంచి ప్రతిభ దాగి ఉంటుందన్నారు. ఆ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం టీచర్స్ చెయ్యాలన్నారు. HM శ్రీను, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

image

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.

News November 20, 2025

వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రూ. 2 కోట్ల 3 లక్షల 25 వేల 676 వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ ద్వారా 228 గ్రాముల బంగారం, 14 కిలోల 300 గ్రాముల వెండి సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, ఎస్ఎఫ్‌ఐ, హోంగార్డుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.

News November 20, 2025

బోర్డులను “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చారు: సంజయ్‌

image

కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల భక్తులకు ప్రభుత్వం, దేవస్వం బోర్డు చేసిన ఏర్పాట్లు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ఇటీవల AP భక్తులతో కేరళ పోలీసు అధికారి <<18328677>>అసభ్యకరంగా ప్రవర్తించడం<<>>పై మండిపడ్డారు. దేవస్వం బోర్డులను కమ్యూనిస్టులు “బ్రోకర్ల డెన్‌”లుగా మార్చి, ఆలయాలను ATM కేంద్రాలుగా చూస్తున్నారన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైరయ్యారు.