News February 27, 2025
రేవేంద్రపాడులో భార్యాభర్తల అనుమానాస్పద మృతి

దుగ్గిరాల (M) రేవేంద్రపాడులో అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతిచెందారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేశ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శ్రావణి మృతదేహం కూడా పక్కనే పడి ఉంది. కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవ జరుతున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి వీరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇంట్లో విగత జీవులుగా ఉన్న ఇద్దరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News March 20, 2025
గుంటూరు: పోలీస్ స్టేషన్‌కు చేరిన ప్రేమ వ్యవహారం

పొన్నెకళ్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(24) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేసి అరండల్ పేటలోని లాడ్జిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తనను కొట్టి యువతిని తీసుకెళ్లారని నాగమల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ వీరస్వామి తెలిపారు.
News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.
News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.