News January 20, 2025
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ADB కలెక్టర్

రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల మాదిరిగానే 21 నుంచి చేపట్టే గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.
Similar News
News February 15, 2025
నేడు ఆదిలాబాద్ జిల్లాలో వారికి సెలవు..

శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శనివారం స్పెషల్ క్యాజువల్ సెలవు ఇస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. బంజారా ఉపాధ్యాయ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
News February 15, 2025
ఆదిలాబాద్: ‘పాఠశాలల అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేసుకోవాలి’

పాఠశాలల అభివృద్ధి కోసం పీఎంశ్రీ కింద మంజూరైన నిధులు సద్వినియోగం చేసుకుని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా విద్యా శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. కిచెన్ షెడ్, డార్మిటరీ, డైనింగ్ హాల్, తదితర వాటిని పరిశీలించి, పాఠశాలకు అవసరమైన మరమ్మతుల కోసం అంచనాల నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.
News February 15, 2025
ADB: ‘మూల్యాంకనం విధుల నుంచి వారు తొలగింపు’

TUTF సంఘం నాయకుల ప్రాతినిధ్యం మేరకు పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను తొలగిస్తూ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉత్తర్వులు జరిచేసినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి సమస్యను విన్నవించగా విద్యాశాఖ అధికారికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు.