News April 19, 2024
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచనలతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం లబ్ధిదారుల్లో 70శాతం మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,13,855 రేషన్ కార్డులుండగా, 6,85,910మంది రేషన్ లబ్ధిదారులున్నారు. ఇంకా పలు కారణాలతో 2,05,084మంది ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు.
Similar News
News September 7, 2024
సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.
News September 7, 2024
నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.
News September 7, 2024
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచనలు చేస్తూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మెదక్ జిల్లాలో ఉన్నదన్నారు.