News August 30, 2024

రేషన్ కార్డుదారులకు తీపి కబురు

image

రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు పంచదార పంపిణీకి చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ 2 నెలలుగా పంచదార పంపిణీ ఆపేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో 6,76,209 మంది రేషన్ కార్డుదారులకు 10,715 టన్నుల బియ్యం, 352 టన్నుల పంచదార, నంద్యాల జిల్లాలో 5,41,804 మంది కార్డుదారులకు 7,361 టన్నుల బియ్యం, 276 టన్నుల పంచదార పంపిణీ చేయనుంది.

Similar News

News November 13, 2025

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్‌లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.

News November 13, 2025

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌‌లో సమర్పించాలని సూచించారు.

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.