News February 10, 2025

రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి

image

అర్హులైన ప్రతిఒక్కరు నూతన రేషన్ కార్డులకు, పెన్షన్లకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతొక్కరు ఆయాగ్రామల్లో సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి తెలిపారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.

Similar News

News December 19, 2025

ప్రకాశం జిల్లాలో వీరి కల నెరవేరేదెన్నడో?

image

సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే కేంద్రం పీఎం గ్రామీణ ఆవాస్ యోజన ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. నవంబర్ 6 నుంచి జిల్లాలో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 38 మండలాల్లో 729 పంచాయతీల్లో 41,706 మంది సొంతింటి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. వీరి దరఖాస్తుల రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా, ప్రస్తుతం వీరి సొంతింటి కల నెరవేరడమే తరువాయి భాగం.

News December 19, 2025

ఒంగోలు: రైతులారా ఈ నంబర్స్ సేవ్ చేసుకోండి..!

image

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సాగుతున్న నేపథ్యంలో రైతుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూము నంబర్ 8008901457ను సంప్రదించాలన్నారు. వాట్సాప్ నంబర్ 7337359375కు మెసేజ్ చేయాలని జేసీ సూచించారు.

News December 19, 2025

అనాథలను సొంత పిల్లలుగా భావించాలి: ప్రకాశం JC

image

తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు JC గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. అనాథలైన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు సమకూర్చాలన్నారు. 18ఏళ్లు దాటిన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు.