News April 3, 2025
రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్

రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డులకు మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. సాగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులో పేర్లను సైతం మీ- సేవ కేంద్రాలద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామే స్వచ్ఛందంగా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తామని తెలిపారు.
Similar News
News April 11, 2025
నల్గొండ జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెలరోజుల పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30, 30ఎ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 10, 2025
ప్రణాళిక అంచనాలు రూపొందించాలి: కలెక్టర్ ఇలా

గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళికతో పాటు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్తి ఆబా యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
News April 10, 2025
నల్గొండ: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.