News April 17, 2025
రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

రేషన్ కార్డులకు సంబంధించి కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రేషన్ కార్డుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News February 26, 2026
యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కే.పద్మరాజు

యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కె.పద్మరాజును నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ ఎన్.మోహనరావును బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లు యూనివర్సిటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. నూతన ప్రిన్సిపల్‌గా పద్మరాజు వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అపార అనుభవం ఉన్న ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 26, 2026
HNK: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, HNK క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి. నేటి నుంచి మార్చి 4వ తేదీలోగా https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని క్రీడల అధికారి అశోక్ తెలిపారు.
News February 26, 2026
బిందు సేద్యం ఆటో మెడిటేషన్ రైతులకు వరం: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన APMIP డ్రిప్ ఇరిగేషన్ ఆటో మెడిటేషన్ పథకానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ గురువారం కలెక్టరేట్లో విడుదల చేశారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా చిన్న, సన్నకారు రైతులు 55%, పెద్ద రైతులకు 45% సబ్సిడీ పొందవచ్చన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 14 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యం కాగా 11,952 హెక్టార్లలో పూర్తి అయిందన్నారు.


