News February 12, 2025

రేషన్ కార్డ్‌లపై అదనపుఛార్జి వసూలు చేస్తే కాల్ చేయండి

image

కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు వచ్చే పేద ప్రజలు మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ సేవల రుసుము ₹45 మాత్రమే చెల్లించాలి. రసీదుపై ప్రింటైన రుసుమ కంటే నయా పైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అని తెలిపారు. అదనంగా వసూలు చేస్తే 040-45676699 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 5, 2025

HYD: ‘వాక్ టు వర్క్’ అంటే తెలుసా?

image

BFCలో భాగంగా ‘వాక్ టు వర్క్’(WTW)ను ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక ప్రణాళిక కింద నివాస ప్రాంతాలకు ఆఫీసులు, విద్యాసంస్థలు దగ్గరగా ఉండేలా డిజైన్ చేస్తారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌‌ను తప్పించుకుని స్కూళ్లు, ఆఫీసుల నుంచి ఇంటికి బై వాక్ వెళ్లొచ్చు. తద్వారా కార్బన్ ఉద్గారాలు, పొల్యూషన్ గణనీయంగా తగ్గి ‘నెట్-జీరో సిటీ’ లక్ష్యాన్ని సాధించడానికి <<18479244>>WTW<<>> కీలకమవుతుంది.

News December 5, 2025

TG కోసం శ్రీకాంత చారి.. BCల కోసం ఈశ్వర చారి!

image

తెలంగాణ నేలపై ఉద్యమ జ్వాల ఎప్పటికీ చల్లారదు. హక్కుల కోసం ప్రాణాలు పణంగా పెట్టే సాహసమే ఈ మట్టి మనుషుల స్వభావం. 2009లో ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన ఆత్మాహుతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అదే జ్వాల మళ్లీ రాజుకుంది. BCలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహంతో కూకట్‌పల్లికి చెందిన సాయి ఈశ్వర చారి గురువారం తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు.*హక్కుల కోసం ఆత్మహత్య చేసుకోవద్దు.. బతికి సాధించాలి.

News December 5, 2025

అసలేంటీ భారత్ ఫ్యూచర్ సిటీ?

image

TG టౌన్ ప్లానింగ్, ఆర్థికాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచే ఒక సాహసోపేతమైన అధ్యాయమే ఫ్యూచర్ సిటీ. ఫార్మా సిటీ, RRR, IT కారిడార్ల మధ్య వ్యూహాత్మకంగా 30K ఎకరాల విస్తీర్ణంలో నూతన నగరాన్ని(BFC) నిర్మించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గమనం, జీవన ప్రమాణాలను సమూలంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ సిటీలో ‘వాక్ టు వర్క్’ అనే విప్లవాత్మక కాన్సెప్ట్‌ హైలైట్‌ కానుంది.