News April 5, 2025
రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
News November 27, 2025
NLG: మాజీ సైనికుల పిల్లలకు గుడ్ న్యూస్

మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.krb.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682-224820 నంబర్ కు సంప్రదించాలని కోరారు.


