News February 16, 2025

రేషన్ బియ్యం అమ్మకండి: డీఎస్‌వో

image

రేషన్ బియ్యం అమ్మినా – కొన్నా వారిపై నిత్యావసరాల చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని నిర్మల్ జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. రేషన్ షాప్‌ల్లో ప్రతినెలా ప్రభుత్వం ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తుందని, ఆ బియ్యం పోషకాలు కలిగిన బలవర్థకమైన ఆహారమని పేర్కొన్నారు. అందులో ఐరన్, విటమిన్-B12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయన్నారు.

Similar News

News October 19, 2025

పెనుగంచిప్రోలు: లొంగిపోయిన చిట్టీల వ్యాపారి

image

పెనుగంచిప్రోలులో గత వారం రోజుల క్రితం సుమారు రూ.5 కోట్లతో పరారైన చిట్టీల వ్యాపారి చిన్న దుర్గారావు ఆదివారం సీఐ కార్యాలయంలో లొంగిపోయారని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో మోసాలు చేసి దుర్గారావు పారిపోగా, ఎస్సై అర్జున్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

News October 19, 2025

ఏలూరులో ఒకరు సూసైడ్

image

కరెంటు వైరుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చెసుకున్న ఘటన ఆదివారం ఏలూరులోని వంగాయగూడెంలో జరిగింది. మృతుడు వంగయాగూడెంనకు చెందిన చంద్రమౌళి(32) సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడిని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 19, 2025

కొత్తగూడెం: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపు

image

బీసీ బంద్, బ్యాంకు బంద్‌ల కారణంగా దరఖాస్తులు సమర్పించలేని ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా అబ్కారీ అధికారి జానయ్య తెలిపారు. ఈ కారణంగా ఈనెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రాను ఈనెల 27కు వాయిదా వేసినట్లు చెప్పారు. డ్రాను కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.