News February 16, 2025
రేషన్ బియ్యం అమ్మకండి: డీఎస్‌వో

రేషన్ బియ్యం అమ్మినా – కొన్నా వారిపై నిత్యావసరాల చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని నిర్మల్ జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. రేషన్ షాప్‌ల్లో ప్రతినెలా ప్రభుత్వం ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తుందని, ఆ బియ్యం పోషకాలు కలిగిన బలవర్థకమైన ఆహారమని పేర్కొన్నారు. అందులో ఐరన్, విటమిన్-B12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయన్నారు.
Similar News
News April 19, 2026
నిర్మల్ డీసీసీలో మార్పులు

నిర్మల్ జిల్లా డీసీసీలో మార్పులు ప్రతిపాదించారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సవరించిన కార్యవర్గ జాబితాను సిద్ధం చేశారు. ధర్మ గౌడ్, రమేష్, మమ్మాయి రమేష్‌ను వైస్ ప్రెసిడెంట్లుగా, దాశరథి రాజేశ్వర్‌ను కోశాధికారిగా, డీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా మజార్ ఖాన్ ప్రతిపాదించారు. పలు మండలాల నుంచి సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.
News April 19, 2026
టాస్ గెలిచిన లక్నో

IPL: పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చంఢీఘర్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, వధేరా, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, అర్ష్‌దీప్, చాహల్.
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, బదోని, పూరన్, ముకుల్, షమీ, ఆవేశ్, సిద్దార్థ్, ప్రిన్స్, మోహ్‌సిన్.
News April 19, 2026
MNCL: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 1120 మంది విద్యార్థులకు గాను 989 మంది, 7వ తరగతికి 305 మంది విద్యార్థులకు 285 మంది, 8వ తరగతి 225 మందికి 203, 9వ తరగతికి 151 మందికి 142, పదవ తరగతికి 33 మంది విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు డీఈవో యాదయ్య తెలిపారు.


