News March 3, 2025
రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలి: జేసీ

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం మండలం చినమిరం గ్రామంలో 62 నెంబరు రేషను షాపును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టరును, కార్డుదారులకు పంపిణీ చేసే రికార్డులను పరిశీలించారు. ఎండీయూ వాహనంపై సరుకుల వివరాలు రేట్లు పట్టికను పరిశీలించారు.
Similar News
News March 4, 2025
MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ అభ్యర్థి..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
News March 4, 2025
ప.గో: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
News March 4, 2025
జైన్ ఇరిగేషన్ సిస్టంతో ఉద్యాన వర్సిటీ ఎంవోయూ

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలోని డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మహారాష్ట్రలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కంపెనీతో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యధిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విభాగాలను ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఉపకులపతి కే. గోపాల్ తెలిపారు.