News April 5, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.
Similar News
News December 13, 2025
Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.
News December 13, 2025
కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ

హైదరాబాద్ వచ్చిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్లో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి బయల్దేరుతారు.
News December 13, 2025
రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.


