News April 5, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.
Similar News
News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్ థైరాయిడ్ ఉండటం వలన ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనించారు.
News April 20, 2025
కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.