News March 4, 2025
రైతులందరికీ సాగునీరు అందించాలి: నిర్మల్ కలెక్టర్

యాసంగిలో రైతులందరికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం సీఎస్ నిర్వహించిన వీసీలో ఆమె పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్లను తనిఖీ చేస్తున్నామని, వేసవిలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News October 26, 2025
తోటపల్లి స్ట్రగుల్స్: వరదొస్తే.. గుబులే..!(2/2)

వరదలకు భయపడ్డ <<18106869>>బాసంగి<<>> గ్రామస్థులు వారి ఊరికి సమీపంలో స్థలాలు కొనుక్కొన ఇళ్లు కట్టుకుంటున్నారు. అయితే ఆ ఇళ్ల వద్ద రోడ్లు, కరెంట్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బిల్లులు చెల్లింపు, R&R ప్యాకేజీ ఇవ్వడంలోనూ జాప్యం నెలకొంటోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
News October 26, 2025
ప.గో: రైతులకు తుఫాను భయం

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
News October 26, 2025
కరీంనగర్: విద్యాసాగర్కి డాక్టరేట్..!

శాతవాహన విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి కె.విద్యాసాగర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాగర్ పరిశోధన గ్రంథం ప్యాటర్న్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్డిచర్ ఆన్ ఎడ్యుకేషన్: ఏ స్టడీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన చేశారు. అర్ధశాస్త్ర విభాగాధిపతి డా.కోడూరి శ్రీవాణి పర్యవేక్షణలో డాక్టరేట్ అందజేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.


