News February 14, 2026

రైతులకు అలర్ట్.. ఖమ్మం మార్కెట్‌కు సెలవు లేదు

image

ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు మార్కెట్ కమిటీ అధికారులు కీలక సమాచారం అందించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాధారణంగా సెలవు ఉంటుందని భావించే రైతులు అయోమయానికి గురికావద్దని, మార్కెట్ పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ మిర్చి పంటను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మార్కెట్‌కు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.

Similar News

News March 11, 2026

హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

image

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.

జూన్ 2నే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవం రోజునే వరంగల్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీవోసీ) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. HYDలో మంగళవారం జరిగిన జిల్లా మంత్రి సమావేశంలో ఉమ్మడి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివ్భద్ది పనులపై సమీక్షించారు. కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన, భద్రకాళీ పనులను వేగంగా పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు సమాచారం.