News January 30, 2025

రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి: కలెక్టర్

image

రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గుచూపేలా, భూమిలో సూక్ష్మ పోష‌కాల లోపాన్ని అరిక‌ట్టేలా రైతుల‌కు పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని.. ఇందుకు పొలం పిలుస్తోంది వంటి కార్య‌క్ర‌మాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌, ఆక‌స్మిక త‌నిఖీల్లో భాగంగా క‌లెక్ట‌ర్ గురువారం ఏ.కొండూరు, జి.కొండూరు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. 

Similar News

News December 5, 2025

వనపర్తి: సర్పంచ్ అభ్యర్థులుగా 177 మంది నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు గురువారం మొత్తం 177 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 27 నామినేషన్లు.
✓ పానగల్‌ – 50 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 41 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్‌ – 19 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 40 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం సర్పంచ్‌ల నామినేషన్లు 222కు చేరింది.

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.