News October 22, 2024
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సిద్ధం: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతునందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతుల భూములకు సంబంధించి మట్టి నమూనా పరీక్షలు చేపట్టాలన్నారు. రైతులు పండించే పంటలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలతో అనుసంధానం చేసి చేరువ చేయాలన్నారు.
Similar News
News February 26, 2026
నెల్లూరు: ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఈ నెల పింఛన్లను ఒక్క రోజు ముందుగానే ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మార్చి నెల ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛన్ నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 289647 పింఛన్లకు సంబంధించి రూ.126.91 కోట్లను అందజేస్తున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.
News February 26, 2026
NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.