News November 7, 2024

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలి: ఆర్వి కర్ణన్

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. మల్యాల మండలం రామన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ధాన్యం మ్యాచరుకు వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, తాసిల్దార్, ఎంపీడీవో ఉన్నారు.

Similar News

News December 8, 2024

SUలో జాబ్‌మేళా.. 427 మందికి ఆఫర్ లెటర్స్

image

KNR శాతవాహన యూనివర్సిటీ లో నిన్న మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2649 మంది అభ్యర్థులు రిజిస్టర్ కాగా 845 మంది షార్ట్ లిస్ట్ అయ్యి 427 మంది కంపెనీల వద్ద నుంచి ఆఫర్ లెటర్లను పొందారు. కాగా జాబ్‌మేళాలో ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులను నిర్వాహకులు, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. ఈ మేళాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

News December 8, 2024

జగిత్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

image

జగిత్యాల జిల్లా బుగ్గారం MPDO గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, తన సిబ్బందితో గడిపిన ఆయన మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్‌లో విషాదం నెలకొంది.

News December 8, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,93,193 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,082 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,280, అన్నదానం రూ.20,831, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.