News February 5, 2025
రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి: కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆయన కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
Similar News
News February 10, 2025
కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!

కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.
News February 10, 2025
సూళ్లూరుపేట: చలి కాచుకుంటున్న లేగ దూడలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువై దట్టమైన పొగ మంచు కమ్మేసి మనుషుల్నే కాదు జంతువులను సైతం వణికిస్తోంది. దీంతో మనుషులే కాదు పశువులు సైతం చలికాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పచ్చని పచ్చిక బయళ్లలో, పశుశాలల్లో పెరగాల్సిన గోవులను వాటి యజమానులు రోడ్ల మీద వదిలివేయడంతో అవి దయనీయ స్థితిలో బతుకుతున్నాయని పశు ప్రేమికులు వాపోతున్నారు.
News February 10, 2025
నెల్లూరు: విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

బాలిక(13)పై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదివే ఓ బాలిక రోజూ ఆటోలో స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్ ఆటో నడిపే సతీశ్ బాలికను బీచ్‌కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆటోడ్రైవర్ స్నేహితుడు సునీల్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు.