News August 30, 2024

రైతులకు నిరాశ.. తగ్గిన అన్ని రకాల మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయి. గురువారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,000 పలకగా.. నేడు రూ.17,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్న రూ.14,600 పలకగా నేడు రూ.14,000కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH)కి నిన్న రూ.15వేల ధర రాగా ఈరోజు రూ.14,500కి చేరింది.

Similar News

News December 12, 2025

వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొత్త సమీకరణలు!

image

WGL తూర్పు కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.

News December 12, 2025

వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

image

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.