News November 22, 2024
రైతులకు బేడీలు వేసిన మీరు పరామర్శిస్తున్నారా: ఎంపీ రేణుక
ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మరిచిపోయి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. ఈరోజు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి వెళ్లి రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉండి రైతులకు బేడీలు వేసిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.
Similar News
News December 12, 2024
ఖమ్మం: రేపు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ: కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏసీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ బహిరంగ విచారణ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. విచారణ కమీషన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సంఘ నాయకులు అధిక సంఖ్యలో హాజరై వారి వినతులను అందజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News December 11, 2024
కమనీయం భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News December 11, 2024
ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా..!
ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఎడాదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కలెక్టరేట్‌లో ఓ అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఖమ్మం రేంజ్ కార్యాలయం నెంబర్లు-9154388981, 08742-228663, ఈ-మెయిల్ dsp_acb_kmm@telangana. gov.inను సంప్రదించాలన్నారు.