News February 22, 2025
రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరు పై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పై మండల వారీగా వివరాల గురించి ఆరా తీశారు.
Similar News
News November 20, 2025
రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొన్నం

కరీంనగర్ జిల్లాలో రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎల్ఎండీ కాలనీ వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లోని సారధి కళామందిర్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.


