News October 17, 2025
రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
Similar News
News November 3, 2025
తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.
News November 2, 2025
మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.


