News March 19, 2025

రైతులకు రుణ పరిమితి పెంచాలి: కలెక్టర్ దినేశ్

image

వచ్చే ఖరీష్ సాగుకు రైతులకు రుణ పరపతి పెంచి, పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, వ్యవసాయానుబంధ శాఖల అధికారులతో డిసెంబరు త్రైమాసిక జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు రుణాలు అందించి వ్యవసాయనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకులు సహకారం అందించాలన్నారు. లక్ష్య సాధనకు బ్యాంకర్లు అంకితభావంతో సేవలందించాలని అన్నారు.

Similar News

News April 18, 2025

తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

image

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.

News April 18, 2025

అంబేడ్కర్ కోనసీమలో ప్రజలకు విద్యుత్ కష్టాలు 

image

కోటిపల్లి వద్ద విద్యుత్ టవర్ కూలిపోవడంతో కోనసీమ ప్రజలకు శాపంగా మారింది. దాంతో ప్రజలు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజుల నుంచి సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి సమయంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమలు చేయడంతో అంబేడ్కర్ కోనసీమలో విద్యుత్ కోత వల్ల ప్రజలు చిమ్మచీకటిలో కాలం వెల్లుబుచ్చుతున్నారు. విద్యుత్ సరఫరా లేని కారణంగా దోమల మోతతో నిద్రకు దూరమయ్యారు.

News April 18, 2025

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

image

రైలు నుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతిచెందాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..అన్నవరం-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అప్పారావు(55) మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా మృతుడు ఎల్.కోట మండలం వీరభద్రపేటకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

error: Content is protected !!