News July 13, 2024
రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల

చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులు, రాజకీయ నేతల అభిప్రాయాలు తీసుకొని రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
Similar News
News February 11, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.
News February 11, 2025
MBNR: ఎన్నికల నిర్వహణపై శిక్షణ

ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.