News January 16, 2025
రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కాకాణి

రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండల పరిధిలోని పులికల్లు, నేదురుమల్లి, వెలికంటి పాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటానని తెలిపారు.
Similar News
News February 12, 2025
నెల్లూరు: టెన్త్ అర్హతతో 63 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో నెల్లూరు డివిజన్‌లో 63 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీలోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 12, 2025
మర్రిపాడు వద్ద హైవేపై ఘోర ప్రమాదం.. బాలుడి స్పాట్ డెడ్

మర్రిపాడులోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కస్తూర్బా గాంధీ కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నన్నోరుపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(16) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.